ప్రతి సంవత్సరం జనవరి 13వ తేదీ నుంది సుమారు నెలరోజుపాటు వార్షిక మహోత్సవము అత్యంత వైభవంగా జరుగును.
మరియు ప్రతి సంవత్సరం శ్రీ అమ్మవారికి జ్యేష్టమాసంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. (జూన్-జులై మాసాలలో). జాతర సందర్భంగా అనేక సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల కళాకారులను ఆహ్వానించి వారిని సన్మానిస్తారు.
ఇతర వివరాలకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చును:
సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి
శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం
పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్ : 08116 - 239505
ఎలా వెళ్ళాలి : విజయవాడ నుండి నర్సాపూర్ రైలు మార్గంలో భీమవరం స్టేషన్‌లో దిగి అక్కడ నుండి ఆటోలలో వెళ్ళవచ్చు. లేక విజయవాడ నుండి రోడ్డు మార్గంలో భీమవరానికి వెళ్ళవచ్చు.